భట్టికి వివాహ పత్రిక అందజేసిన ఎమ్మెల్యే
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇవాళ డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే తన కుమారుడు శ్రీరామ్ రెడ్డి వివాహానికి హాజరు కావాలని వివాహ పత్రిక అందజేశారు. అనంతరంDy.CMను శాలువాతో సత్కరించారు.