నేడు హర్ ఘర్ తిరంగా కార్యశాల

MDK: పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యశాల నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యశాలకు జిల్లా స్థాయి నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, మహిళా మోర్చా, యువ మోర్చా నాయకులు పాల్గొనాలన్నారు.