ఆ అవశేషాలు.. బందీలవి కావు: ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల మృతదేహాలను హమాస్ సంస్థ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల 3 అవశేషాలను రెడ్ క్రాస్ ద్వారా చేరవేసింది. అయితే తమ పరీక్షల్లో అవి బందీలకు చెందినవి కావని.. వేరెవరివో అని తేలినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే మృతదేహాల అప్పగింతకు ముందు నమూనాలు ఇచ్చేందుకు తాము ముందుకు వచ్చినా ఇజ్రాయెల్ రాలేదని హమాన్ ప్రకటించింది.