ప్రియుడి పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు
ఛత్తీస్‌గఢ్ కొండగావ్ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకే వేదికపై ఇద్దరు యువతుల మెడలో హితేశ్ యాదవ్ అనే యువకుడు తాళి కట్టాడు. ఫూల్‌వతి అనే అమ్మాయిని ప్రేమించగా.. ఆమె నిరాకరించడంతో యామినితో పెళ్లికి హితేశ్ సిద్ధమయ్యాడు. తీరా ముహూర్తం సమయానికి ఫూల్‌వతి మనసు మార్చుకుని తననే పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.