'ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించండి'

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు కలిసి బుధవారం నిరసన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్యోగ కార్మికులు బానిసలులాగా పనిచేసే నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విశ్వతేజకు వారు వినతి పత్రాన్ని అందజేశారు.