కొబ్బరి బొండాలకు పెరుగుతున్నడిమాండ్
NLG: జిల్లాలో కొబ్బరి బొండాల ధరలు అమాంతంపెరగడంతో వినియోగదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభం కావడంతో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టి కొబ్బరి బొండాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు ధరలను రెట్టింపు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకే వస్తున్నా ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నట్లు వారు తెలిపారు.