VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంబరాలు
ప్రకాశం: శాశ్వత రాజధానిగా అమరావతి ఏర్పడటంతో గిద్దలూరులో సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచ రాజధానులలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు.