నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్
HYD: రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మధ్యాహ్నంలోపు వెలువడనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల సంబరాలతో ఇవాళ నగరం మొత్తం దద్దరిల్లనుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలే అవకాశం ఉంది. కాగా, ఈ ఫలితం ఎవరికీ అనుకూలంగా వస్తుందో తేలాలంటే మధ్యాహ్నం వరకు వేచిచూడాల్సిందే.