VIDEO: ముప్పాలలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు
ఎన్టీఆర్ జిల్లా ముప్పాల గ్రామంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు జరిపారు. గత కొద్ది కాలంగా కొండలరావు అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో మెరుపుదాడులు నిర్వహించారు. అనంతరం కొండలరావును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.