VIDEO: కోత గురైన అన్నారం పెద్ద చెరువు .

WGL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు పూర్తిగా నిండి ప్రమాదపుటంచున చేరుకున్నాయి. సోమవారం పర్వతగిరి మండలం అన్నారం దర్గా చెరువు రెండు చోట్ల సుమారు మూడు మీటర్ల మేర కోతకు గురైంది. వరద తాకిడికి చెరువు ఎక్కడ తెగిపోతుందోనని అన్నారం గ్రామస్తులు భయాందోళనలో కాలం వెలదీస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.