వరసిద్ధి వినాయక స్వామి సేవలో ఎమ్మెల్యే

వరసిద్ధి వినాయక స్వామి సేవలో ఎమ్మెల్యే

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శనివారం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దక్షిణ ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.