మైనారిటీ బాలికల పాఠశాలను సందర్శించి కలెక్టర్
MDCL: జిల్లా కలెక్టర్ మను చౌదరి నాగారంలోని మైనారిటీ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అక్కడి సిబ్బందికి ఆదేశించారు. చదువుతో పాటు స్మార్ట్ వర్క్ కోసం చాట్ జీపీటీ, జెమిని వంటి AI టూల్స్ వాడాలని, క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. విద్యార్థుల కోసం క్రీడా కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.