VIDEO: ఎండాడ-రుషికొండ ప్రధాన రహదారిలో ఆపరేషన్ లంగ్స్
VSP: ఎండాడ-రుషికొండ రోడ్డులో జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ లంగ్స్'పై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రస్తుతానికి కొందరిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ చర్యలు తప్పవని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి ఇది కీలకమని ఆయన పేర్కొన్నారు.