ఇందిరమ్మ ఇళ్లతోనే ప్రజలకు న్యాయం: ఎమ్మెల్యే
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేటలో బీఆర్ఎస్ పార్టీపై శనివారం తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే "ఇందిరమ్మ ఇల్లు" పథకం అమలు అవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుని వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.