రవీంద్రనాథ్ ఠాగూరికి ఘన నివాళి

KDP: కడపలోని డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బుధవారం నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల అధిపతులు ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య, కళా, తాత్విక రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు. వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.