SRH కెప్టెన్సీ.. యువీ అసంతృప్తి
పాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో IPL 2026లో SRHను ఇషాన్ కిషన్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. 'ఏడేళ్లుగా అభిషేక్ ఓ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టు కోసం బాగా ఆడుతున్నాడు. ఓ రాష్ట్రానికి కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. అయినా అతనికి ఆ ఫ్రాంచైజీ కెప్టెన్సీ ఇవ్వట్లేదు' అని పేర్కొన్నాడు.