వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
E.G: అమలాపురం పట్టణం పట్టాభి స్ట్రీట్‌లో ఒక ఇంటిలో వ్యభిచారం జరుతుందన్న సమాచారంతో పట్టణ పోలీసులు బుధవారం దాడి చేశారు. కొంతమంది అండతో వెంకట రమణ అనే మహిళ ఇద్దరు అమ్మాయిలతో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో రైడ్ చేయగా ఇద్దరు అమ్మాయిలతో పాటు, నలుగురు విటులు, రూ.2 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.