VIDEO: రబీ వరి పంటపై రైతులు సంతృప్తి
NTR: నందిగామ మండలం కంచల గ్రామంలో రబీ సీజన్‌లో వేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. నీరు పుష్కలంగా అందడంతో దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతులు తెలిపారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సీజన్‌లో ఎక్కువ దిగుబడి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి దిగుబడి రావడం వల్ల ఆర్థికంగా ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు.