VIDEO: రైతు సమస్యలపై ఉద్యమానికి సిద్ధం

కృష్ణా: సాగునీరు, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడూరు మండలంలోని ఉల్లిపాలెం, సాలెంపాలెం గ్రామాల్లో పంట భూములు బీడుగా మారుతున్నాయి. ఆకుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గ్రామాల్లో పరిశీలన జరిపారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి సిద్ధమన్నారు.