VIDEO: 'జీవో రద్దు వరకు ఆందోళన చేస్తాం'

NTR: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన జీవో తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలకు విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడం దారుణం అన్నారు.