చల్లకాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

చల్లకాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

TPT: గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద చెట్ల పొదల్లో చల్ల కాలువ నుంచి కొట్టుకొని వచ్చి చెట్లలో ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని, పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.