ఘాట్ రోడ్లపై భద్రత..సెన్సర్ గుర్తిస్తే సైరన్

ఘాట్ రోడ్లపై భద్రత..సెన్సర్ గుర్తిస్తే సైరన్

భువనేశ్వర్ ఐఐటీ రూపొందించిన ‘వెహికల్ సెన్సార్ అలర్ట్’ పరికరం ఘాట్ రోడ్లపై ప్రమాదాలను నివారిస్తుంది. కళింగ ఘాట్ రోడ్డులో రెండు వైపులా అమర్చిన ఈ సౌరశక్తి పరికరం వాహనాల కదలికలను గమనిస్తూ.. డ్రైవర్లు నియంత్రణ కోల్పోవడాన్ని గుర్తించి రెడ్ లైట్లు, సైరన్లతో హెచ్చరిస్తుంది. అయితే, అధికారులు దీనిని పరిశీలించి మిగతా ప్రమాద ప్రాంతాల్లో అమర్చనున్నారు.