రేపు ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే
TPT: తడ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎంపీడీవో శేఖర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, అర్జీలలో తప్పనిసరిగా గ్రామం పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ రాయాలని సూచించారు.