గుడిని పాత చోటే పునఃప్రతిష్ఠిస్తాం: జగ్గారెడ్డి
SRD: పట్టణంలో NH విస్తరణలో తొలగించిన భూలక్ష్మమ్మ గుడిని పాత చోటే పునఃప్రతిష్ఠిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. రోడ్డు పనుల వల్ల దుకాణాలు కోల్పోయిన పండ్ల వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల వారు తిరిగి అక్కడే షాపులు పెట్టుకునేలా చూస్తామన్నారు. బాధితులు తమ వివరాలను మున్సిపల్ ఛైర్మన్‌కు అందజేయాలని సూచించారు.