గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర్

MDK: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటనకు రాగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి స్వాగతం పలికారు. బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నాయకులు రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.