రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు
కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటనరసింహపురం కాలనీలో రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించిన అధికారులు ఎల్పీ నంబర్-7లోని ప్రభుత్వ భూమిలో 0.05 సెంట్లు ఆలయానికి కేటాయించారు. ఆలయానికి భూమి కేటాయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.