మేయర్‌ను నిలదీసిన గణేష్ భక్తులు

TG: వినాయక నిమజ్జనం ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిని భక్తులు నిలదీశారు. పోలీసులు కొడుతున్నారని, వాహనాల అద్దాలు పగలగొడుతున్నారని ఆరోపించారు. 'ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ఓ భక్తుడు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చిన మేయర్‌ను ప్రశ్నించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భక్తులను శాంతింపజేయడానికి పోలీసులు, అధికారులు ప్రయత్నించారు.