యూరియా కొరతపై ఎమ్మెల్యే కడియం సమీక్ష సమావేశం

యూరియా కొరతపై ఎమ్మెల్యే కడియం సమీక్ష సమావేశం

జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే కడియం శ్రీహరి యూరియా కొరతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పలు గ్రామాల్లో లభించక ఆందోళనలు చేస్తున్న అంశంపై అధికారులతో చర్చించారు. ముందస్తు ప్రణాళికతో యూరియాకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.