తెనాలిలో ఈనెల 17న విశ్వశాంతి మహా యజ్ఞం

తెనాలిలో ఈనెల 17న విశ్వశాంతి మహా యజ్ఞం

GNTR: తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 17న శుక్రవారం విశ్వశాంతి మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ఉప్పల వరదరాజులు తెలిపారు. లోక కళ్యాణార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి మహా యజ్ఞం జరుగుతుందని, ముందుగా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.