దేశ ప్రజల సంతోషానికి సైనికులే కారణం: ఎమ్మెల్యే
EG: సరిహద్దుల్లో సైనికులు పడుతున్న కష్టమే దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి ప్రధాన కారణమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆత్మీయ కలయికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సైనికుల సేవలను కొనియాడారు. మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.