ఇది 'సూపర్ రాష్ట్రపతి పాలన': సీఎం
బెంగాల్‌లో ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల బందీ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయం గురించి తనకెవరూ చెప్పలేదని, అర్ధరాత్రి ఓ జర్నలిస్టు ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. దీనిని 'సూపర్ రాష్ట్రపతి పాలన'గా ఆమె అభివర్ణించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఈసీ పూర్తిగా విఫలమైందని మమత విమర్శించారు. ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో తనకు అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.