కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ

ASF: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11న వాక్-ఇన్ -ఇంటర్వ్యూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రములతో ఇంటర్వ్యూకి హాజరవ్వాలన్నారు.