కన్నుల పండుగగా పల్లివేట మహోత్సవం

కన్నుల పండుగగా పల్లివేట మహోత్సవం

WGL: నర్సంపేట మండలంలో ఆదివారం శ్రీమాన్ వెంకటేష్ శర్మ గురు స్వామి అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా పల్లి వేట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మున్సిపాలిటీ వరకు భక్తి శ్రద్ధలతో, అయ్యప్ప స్వాములు ఆట, పాటలతో, భక్తి పారవశ్యాల నడుమ ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.