కృష్ణపట్నం పోర్టు వద్ద ఉద్రిక్తత
నెల్లూరు జిల్లా ముత్తుకూరు సెంటర్‌లో అదానీ కృష్ణపట్నం పోర్టు కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సుమారు 200 మందికి పైగా కార్మికులు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. రోజుకు 12 గంటల పాటు పని చేయించుకుంటున్నా, తగిన వేతనం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పని ముగిశాక రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.