పిండిప్రోలు గ్రామంలో కోతుల హడావిడి

పిండిప్రోలు గ్రామంలో కోతుల హడావిడి

KMM: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో కోతుల అల్లరి బుధవారం రాత్రి హడావిడి సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామం మెయిన్ రోడ్‌లో ఉన్న పాత కాంప్లెక్స్‌పై కోతులు గుంపుగా దూకడంతో రేకులు ఒక్కసారిగా కూలిపోయాయి. సుమారు 30 సంవత్సరాల క్రితం వేసిన ఈ రేకులు ఇప్పుడు పాడైపోయి బలహీనంగా ఉన్నాయని స్థానికులు చెప్పారు. వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.