సబ్ జైలును తనిఖీ చేసిన సివిల్ జడ్జి వాణి

SKLM: సబ్ జైల్లో ముద్దాయిలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి తెలిపారు. శనివారం నరసన్నపేట లోని స్థానిక సబ్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న పదిమంది ముద్దాయిలను మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి వసతితోపాటు, పరిశుభ్రమైన భోజనం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు.