మహిళలను మోసం చేసిన కాంగ్రెస్: ఎమ్మెల్యే

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్: ఎమ్మెల్యే

NZB: మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలను ఓటు అడిగే హక్కు లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. ప్రతీ మహిళకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి, నమ్మించి గద్దెనెక్కి వంచించిన అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల హామీలను విస్మరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.