'ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులు అభివృద్ధి చేయాలి'
GNTR: గుంటూరులో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి మంగళవారం మేయర్ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటి సమావేశం నిర్వహించారు. అభివృద్ధితో పాటు ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.