ఇంటర్ పరీక్షకు 285 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు రెండో రోజు 285 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు RIO దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 8954 మంది విద్యార్థులకు 8669 మంది హాజరయ్యారని చెప్పారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆరొఓ దుర్గారావు పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.