ఆదివరాహ స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

ఆదివరాహ స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

PDPL: కమాన్పూర్లోని శ్రీ ఆది వరాహస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల విరాళాల ద్వారా మొత్తం రూ.6,01,076 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. అధికారులు, సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా లెక్కింపును చేపట్టారు. ఆలయంపై భక్తుల విశ్వాసం పెరుగుతోందని, వచ్చిన నిధులను ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.