'మంచి విద్య, పౌష్టికాహారం అందించాలి'

MNCL: చిన్నారులకు మంచి విద్యతో పాటు పౌష్టికాహారం అందించేలా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఖానాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సీడీపీవో శ్రీలత సూచించారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో కడెం, దస్తురాబాద్ మండలాల అంగన్వాడీ టీచర్లకు పోషణ్ భి పడాయి భి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.