VIDEO: టాస్క్ ఫోర్స్ దాడి భారీగా మద్యం స్వాధీనం
WGL: ఖానాపూర్ మండలం బుదరావుపేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సమాచారంతో సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి రూ.1,95,890 విలువైన ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మల్యాల మాధుకర్ రావు (49)ను అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసిన సరుకును ఖానాపూర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.