BREAKING: రూ. 10 వేలు తగ్గిన ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.1,000 తగ్గి రూ.1,48,700గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.