'రాజానగరం నియోజకవర్గాన్ని పలు రంగాలలో అభివృద్ధి చేస్తా'
E.G: వెంకటనగరంలో రూ. 20 కోట్లతో పల్లకడియం తదితర గ్రామాలకు త్రాగునీటి కోసం నిర్మించిన పంపింగ్ స్కీమును రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం ప్రారంభించారు. పల్లకడియం గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు నేటితో తీరిపోయాయని ఎమ్మెల్యే బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.