మధిరలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

మధిరలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

KMM: బీజేపీ సేవా పక్షోత్సవాల సందర్భంగా మధిర టౌన్ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.దీనిలో భాగంగా రామాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాల్లోని పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ కుంచం కృష్ణారావు, పాపట్ల రమేష్, దోర్నాల రవీంద్ర, ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.