'పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు'

'పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు'

NGKL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలైన తిమ్మాజీపేట్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, తదితర మండలాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు శనివార డీఎంహెచ్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి అవసరమైన ప్రథమ చికిత్స మందులు, ఆరోగ్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.