భూసేకరణ సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే
NLG: ఐటి పాముల లిఫ్టు పనులు పూర్తి అయ్యేందుకు భూ సమస్యను త్వరగా పరిష్కరించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని, లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.