నాగపూర్ - SEC వందే భారత్ రైలు టైమింగ్స్ ఇవే..!

HYD: నాగపూర్ - సికింద్రాబాద్(20101) వందే భారత్ రైలుకు అడిషనల్ మంచిర్యాల వద్ద నేడు అదనపు స్టాప్ కల్పించారు. రైలు ఉదయం 5 గంటలకు నాగపూర్ నుంచి బయలుదేరి, మంచిర్యాలకు 8:49కి చేరుకుంటుంది, అక్కడి నుంచి రామగుండం మీదుగా సికింద్రాబాద్ చేరుకునే సరికి 12:15 అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది.