అల్లిపురం రోడ్డులో గుంతలు.. వాహనదారులకు నరకం

అల్లిపురం రోడ్డులో గుంతలు.. వాహనదారులకు నరకం

విశాఖలోని అల్లిపురం రోడ్డు ప్రజలకు నిత్యం నరకం చూపుతోంది. ఈ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో అవి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి.