VIDEO: విజయవాడలో చిప్స్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

VIDEO: విజయవాడలో చిప్స్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని చిప్స్ తయారీ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోయినా, భారీ ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపాడు. సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.